అత్యవసరంగా ల్యాండ్ అయిన అపాచే హెలికాప్టర్


సరికొత్త అపాచే హెలికాప్టర్లలో ఒకదానిని శుక్రవారం సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసరంగా నేలకు దింపాల్సి వచ్చింది. హెలికాప్టర్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అందులో ప్రయాణిస్తున్న వారంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన గంట సేపటికి కీలక వ్యవస్థల్లో తీవ్రలోపం ఎర్పడినట్టు గమనించిన పైలట్ దానిని పంజాబ్ లోని ఇందోరాలో సురక్షితంగా దించారు. హెలికాప్టర్‌ను కాపాడేందుకు పైలట్ సరైన నిర్ణయం తీసుకున్నారని, తగిన మరమ్మత్తుల తర్వాత హెలికాప్టర్‌ను వెనుకకు తరలిస్తామని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన తర్వాత వీటికి సమస్య ఏర్పడడం ఇదే ప్రథమం. 22 అపాచేల కొనుగోలుకు 2015 సెప్టెంబర్‌లో అమెరికాతో సుమారు 8 వేల కోట్ల రూపాయల మేరకు భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది.